భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన : ప్రముఖ క్రికెటర్లు

58
cricket
- Advertisement -

భారత్‌ స్వాతంత్య్రం సాధించి వజ్రోత్సవం పూర్తి చేసుకొని 76వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఇండియా. అత్యంత ప్యాషన్ కలిగిన ఫ్యాన్లు మీరు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా మా అందరి నుంచి శుభాకాంక్షలు అని బట్లర్ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌, బెయిర్‌స్టో, కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌, మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తదితరులు ప్రత్యేక సందేశం ఇచ్చారు.

- Advertisement -