భారత్‌ కు నా కానుక : పాక్‌ సియాల్‌ ఖాన్‌

73
siyal
- Advertisement -

సరిహద్దుల్లో ఉన్న వీక్షకులకు నా కానుక అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు పాకిస్థాన్‌ చెందిన సియాల్‌ ఖాన్‌. భారత్‌ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ మన జాతీయ గీతమైన జనగణమన గీతంను రబాబ్‌ ద్వారా వాయించారు. జనగణమన గీతంను రబాబ్‌తో అద్భుతంగా వాయించిన సియాల్‌ ఖాన్‌ …ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ఇరు దేశాల మధ్య శాంతి, సహనం, మంచి సంబంధాలు ఏర్పడేందుకు స్నేహం, సద్భావనకు చిహ్నంగా నేను భారతదేశ జాతీయ గీతాన్ని వాయించాను అంటూ తెలిపారు. ఇప్పటికే ఈ వీడియోను ఇప్పటివరకూ దాదాపు ఒక మిలియన్‌ మంది వీక్షించారు. 56వేల మంది లైక్‌ చేశారు.

- Advertisement -