లేడి సింగం…రాజీనామా!

291
sunitha yadav
- Advertisement -

సినిమాల్లో కూడా చూడలేని దైర్యం……మంత్రి కొడుకుని రఫ్ ఆడించింది..పై అధికారులు మండలిస్తే రాజీనామా చేసింది.. అధికారుల మొఖం మీదనే మీలాగా నేను చట్టాన్ని కాదని బానిస బ్రతుకు బ్రతకలేనని చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా గుజరాత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సునీతా మాదవ్.

లాక్ డౌన్ సమయంలో బలాదూర్‌గా తిరుగుతున్న మంత్రి కొడుకుని నిలదీసి సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. మంత్రి ఫోన్ చేసినా ఖాతరు చేయలేదు. అంతేగాదు కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ను పీకి వేసింది. ఫలితం ఉదయాన్నే ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌..దీంతో రాజీనామా వ్రాసి అధికారుల ముఖం పై కొట్టింది.

జులై 8 రాత్రి ఆమె సూరత్‌లో విధుల్లో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ అవసరం లేకున్నా బైక్‌పై ప్రయాణిస్తూ ఆమెకు చిక్కారు. వారికి మాస్కులు కూడా లేవు. వారిని అడ్డుకొని రోడ్డుపై నిల్చోబెట్టి కానిస్టేబుల్ సునీతా యాదవ్ క్లాస్ పీకారు.

అయితే.. ఆ వ్యక్తులిద్దరూ గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ కనానీ కుమారుడు ప్రకాశ్ కనానీ స్నేహితులు. పోలీసులు ప్రశ్నిస్తుండగానే వారిలో ఒకరు ప్రకాశ్ కనానీకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన తన కారులో వచ్చి వారిద్దరినీ తన వెంట తీసుకెళ్లిపోయారు. మాకు పవర్ ఉంది. నేను తలుచుకుంటే నా మిత్రులను నువ్వు ఎక్కడ నిలబెట్టావో అక్కడే 365 రోజులూ నిలబెట్టగలను అని వార్నింగ్ ఇచ్చారు.ఆ వార్నింగ్‌కు కానిస్టేబుల్ సునీతా యాదవ్ ఏమాత్రం బెదరకపోగా దీటుగా సమాధానం ఇచ్చారు.

- Advertisement -