రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల్లో తనిఖీలు..!

401
indian petrol
- Advertisement -

పెట్రోల్‌ బంకుల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది. పెట్రోల్‌, డీజిల్‌ను నిర్దేశిత కొలతల మేరకు కాకుండా తక్కువగా పోస్తున్నారని, కల్తీ చేసి అమ్ముతూ బంకు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని గత కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.

ఇందుకోసం జిల్లా పౌరసరఫరాల శాఖ, తూనికల కొలతల శాఖ, ఆయిల్‌ కంపెనీల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2553 పెట్రోల్‌ బంకులకు గాను, ఈ నెల 1వ తేదీ నుంచి 21 వరకు 638 (25%) బంకుల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘిస్తున్న 183 బంకుల యాజమాన్యాలకు క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీచేశారు. ఇందులో రంగారెడ్డి-24, కరీంనగర్‌-20, కామారెడ్డి-20, సిద్దిపేట-14… అత్యధికంగా ఉన్నాయి.

- Advertisement -