బంగ్లాతో టూర్‌…షమీ దూరం

250
- Advertisement -

రేపటి నుండి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌కు దూరమయ్యారు భారత్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ. భుజం గాయం కారణంగా జట్టు నుండి తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రాక్టీస్‌ సెషన్‌లో స్టార్‌ పేసర్‌ షమీ గాయపడ్డాడని…గాయం తీవ్రత అధికంగా ఉందని బీసీసీఐ తెలిపింది.

ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో బీసీసీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని…పూర్తిగా వన్డే సిరీస్‌కు షమీ దూరమయ్యాడని తెలిపింది. అతని స్థానంలో యువ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

వన్డే సిరీస్‌ తర్వాత ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు కూడా షమీ దూరమయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -