సఫారీలకు భారీ షాక్

204
Injured de Villiers ruled out of first three ODIs
- Advertisement -

టీమిండియాతో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న సఫారీలకు వన్డే సిరీస్‌ ముందు గట్టి దెబ్బ తగిలింది. గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు డివిలియర్స్ దూరమయ్యాడు. డాషింగ్ బ్యాట్స్‌మెన్ ఎలాంటి బౌలర్‌నైనా ఎదుర్కొనే ఎబీ…వేలి గాయం కారణంగా మూడు వన్డేలకు దూరమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ మెనేజ్ మెంట్‌ తెలిపింది.

ఇటీవల భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు డివిలియర్స్‌ వేలికి గాయమైంది. ప్రస్తుతం డివిలియర్స్‌ చికిత్స తీసుకుంటుండగా… పూర్తిగా కోలుకున్న తర్వాత ఫిబ్రవరి 10న జరిగే నాలుగో వన్డేకు అతను మళ్లీ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకూ భారత్‌-దక్షిణా ఫ్రికా జట్ల మధ్య ఆరు వన్డేలు ముఖాముఖి తలపడున్నాయి. తర్వాత మూడు టీ 20లను ఆడనుంది.

ఇక మూడో టెస్టులో సఫారీ జట్టుపై ఘనవిజయం సాధించిన భారత్…వన్డే సిరీస్‌లో సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ధోనితో పాటు కీలక ఆటగాళ్లు జట్టులోకి వస్తుండటంతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

- Advertisement -