వర్మ’జీఎస్టీ’ కలెక్షన్‌…? తెలిస్తే షాక్‌..!

214
Varma GST Collections Shocks You
- Advertisement -

‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ఇదో లఘుచిత్రం. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరినీ జనవరి 27న నెట్టింట్లో రిలీజ్‌ చేశాడు వర్మ. అయితే 19 నిమిషాల నిడివి గల ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

దీంతో, నెట్లో ఇది విడుదల కాగానే..చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. లక్షల మంది ఒక్కసారిగా సైట్లోకి ఎంటర్ కావడంతో..అది క్రాష్ అయినట్టుగా కూడా వర్మ తన ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చాడు.

 Varma GST Collections Shocks You

తాజాగా..ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు రూ. 70 లక్షలు ఖర్చైనట్టు టాక్‌. ఇందులో ఎక్కువ భాగం మియా మాల్కోవాకే ముట్టిందని కూడా సమాచారం. ఇక ఈ ‘జీఎస్టీకి’ మ్యూజిక్ అందించిన కీరవాణికి కొంత ఇచ్చారు. ఇక మరోవైపు ‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ కలెక్షన్‌ విషయానికొస్తే..కళ్ళు తేలెయ్యక తప్పదేమో.

ఏకంగా ఈ డాక్యుమెంటరీ రూ.11 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి  ‘జీఎస్టీ’ ఇంత మొత్తాన్ని రాబట్టడానికి కారణం రామ్‌గోపాల్ వర్మ చేసిన పబ్లిసిటేనని వేరే చెప్పనక్కర్లేదు.

- Advertisement -