ఇంద్రాణి.. ట్రైల‌ర్

20
- Advertisement -

యానీయా భరద్వాజ్, క‌బీర్ దుహాన్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ఇంద్రాణి. అత్యాదునిక సాంకేత‌క ప్ర‌మాణాల‌తో, వినూత్న‌భ‌రిత‌మైన టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా స్టెఫన్ పల్లం ద‌ర్శ‌కుడిగా పరిచ‌య మ‌వుతుండ‌గా వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో సుధీర్ వేల్పుల, KK రెడ్డి, జైసన్ సహా నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్రనయిత జిజిన, గరీమా కౌశల్, ప్రతాప్ సింగ్, అజ‌య్‌, స‌ప్త‌గిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌, ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో…

మెలోడిబ్రహ్మ మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ – “ఇంద్రాణి ట్రైల‌ర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు సాయి కార్తిక్. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ “ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర మాట్లాడుతూ – `అమెరికాలో ఉంటూ కూడా ఇక్క‌డ మూవీ నిర్మించిన కేకే రెడ్డి గారికి వారి మిత్రుల‌కి ఆల్ ది బెస్ట్‌..అక్క‌డ ఉండి సినిమా నిర్మించ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. సినిమా మీద ప్యాష‌న్ ఉంటే త‌ప్ప అది సాధ్యం కాదు..వారు నా మిత్రులు అని చెప్పుకోవ‌డానికి నేనే గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఇంద్రాణి పేరులోనే క్రియేటివిటీ ఉంది. పోస్ట‌ర్ చూడ‌గానే డైరెక్టర్ విజ‌న్ అర్ధ‌మైంది. ట్రైల‌ర్ చాలా గ్రాండ్‌గా ఉంది. వారి క‌ష్టం, ఖ‌ర్చు రెండు క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నారు. వారికి మంచి స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను`అన్నారు.

స్టాన్లీ ప‌ల్లం మాట్లాడుతూ – `మూడు రోజుల్లోనే ఇంత పెద్ద ఈవెంట్ జ‌ర‌గ‌డానికి స‌హాయ‌ప‌డ్డ కేకే రెడ్డి గారికి థ్యాంక్స్‌..ఇలా ఈవెంట్ ఉంది చెప్ప‌గానే మొత్తం అమెరికానే ఇక్క‌డ దింపేశారు. నా బ్ర‌ద‌ర్ స్టీఫెన్ ఈ క‌థ‌ని నాకు కోవిడ్ టైమ్‌లో చెప్పాడు. ఆ త‌ర్వాత మా శ్రేయోభిలాషుల‌ స‌హాయంతో మేమే సినిమా నిర్మించాం. షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాత కేవ‌లం వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కోసం ఏడాది క‌ష్ట ప‌డ్డాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంది అనేది ఊహించ‌డం చాలా క‌ష్టం. అంత అద్భుత‌మైన క‌థ‌. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చింది. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే ఆ క్రెడిట్ అంతా మా బ్ర‌ద‌ర్ స్టీఫెన్‌కే చెల్లుతుంది. సాయి కార్తిక్ సింగిల్ సిట్టింగ్స్‌లోనే మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా నిర్మాణంలో మాకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌` అన్నారు.

స్టీఫెన్ ప‌ల్లం మాట్లాడుతూ – `ఈ క‌థ అనుకున్నప్పుడే పెద్ద‌గా చేద్దాం అనుకున్నాను. మీరు ట్రైల‌ర్ చూస్తే ఇదే అత్యంత ఎక్కువ నిడివిగ‌ల ట్రైల‌ర్‌.. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సైన్స్‌ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమా రెండుగంట‌ల న‌ల‌బై నిమిషాల పాటు ఒక విజువ‌ల్ వండ‌ర్‌గా ఉంటుంది. టైమ్ మెషిన్‌, రోబో ఇలా ప్ర‌తీది సినిమాలో కీల‌కంగా ఉంటుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్టైన్ చేస్తుంది. రాబోయో 50 సంవ‌త్సరాల్లో ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండ‌నుంది అనేది ఈ సినిమాలో చూపించాం. ఈ మూవీ యువత‌రానికి చాలా స్పూర్తి దాయ‌కంగా ఉంటుంది` అన్నారు.

సాయి కార్తిక్ మాట్లాడుతూ – “ ఇంద్రాణి ట్రైల‌ర్ చూస్తుంటే మేక‌ర్స్ క‌ష్టం క‌నిపిస్తుంది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం రెడీ అవుతున్నాను. సూప‌ర్‌మేన్ మూవీ లాగా సూపర్ ఉమెన్ మూవీ ఇది, మొత్తం ఎవెంజ‌ర్స్ టీమ్‌ని దింపారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“అన్నారు.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -