పార్టీకో ‘వ్యూహ’కర్త సిద్ధం !

8
- Advertisement -

ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీల హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎడతెరిపి లేని ప్రచారాలు, ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు, ప్రజలను ఆకర్షించే హామీలు.. ఇలా ఒక్కటేంటి గెలుపు కోసం రాజకీయ పార్టీల అస్త్రాలు అనేకం. అయితే పార్టీ బలా హీనతలను అంచనా వేస్తూ ప్రజల నాడీని పట్టేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ కర్తలపై ఆధారపడుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా పార్టీలు స్ట్రాటజిస్ట్ లను నమ్ముకునే ముందుకు కదులుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఏపీలో కూడా ప్రస్తుతం స్ట్రాటజిస్ట్ ల హడావిడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా వ్యూహకర్తలనే నమ్ముకున్నాయి..

గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్.. ఈసారి వైసీపీకి పని చేయడం లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రశాంత్ కిషోర్ అనుబంధ సర్వే సంస్థ ఐ ప్యాక్ మాత్రం వైసీపీ తోనే ఉంది. ఐప్యాక్ అందించిన సర్వేల ఆధారంగానే జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పెద్ద ఎత్తున ఇంచార్జ్ ల మార్పుకు కారణం ఐప్యాక్ అందించిన సర్వే రిపోర్ట్స్ కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఇక టీడీపీ విషయానికొస్తే..

ప్రస్తుతం టీడీపీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మ పని చేస్తున్నారు, ఆయన వ్యూహ రచనలో భాగంగానే టీడీపీ అధిష్టానం వినిత్న కార్యక్రమాలతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బాదుడే, బాదుడు, సైకో పోవాలి సైకిల్ రావాలి, భవిష్యత్ కు బాబు షూరిటీ.. ఇలా ఎన్నో కార్యక్రమాలు టీడీపీ నిర్వహించడం వెనుక ఆ పార్టీ వ్యూకర్త రాబిన్ శర్మ ఉన్నారనేది స్పష్టంగా అర్థమౌతోంది. ఇక సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా రాబిన్ శర్మ వ్యూహ రచనలో భాగమే. మొత్తానికి ఎన్నికల వేళ వ్యూహకర్తల వ్యూహాలు రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నాయి. మరి ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -