వంటేరుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు..

566
vanteru
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటెరు ప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

Vanteru Pratap Reddy

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు.

రెండేళ్ల పాటు ప్రతాప్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని, కొత్త చైర్మన్‌ తన విధులు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కార్యాలయం, వాహనాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిందిగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

- Advertisement -