పునర్నవి గురించి రాహుల్ షాకింగ్‌ కామెంట్స్‌..!

344
Rahul

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. వారిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో కలసిమెలసి ఉన్న తీరు అభిమానులకు బాగా నచ్చింది. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించడంలో పునర్నవి పాత్ర కీలకమే. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో పున్నూ, రాహుల్‌లను లవర్స్‌ని చేసేశారు నాగార్జున.

సమయం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఈ ఇద్దరి మధ్య బంధాన్ని లవ్ ట్రాక్‌గా మలిచారు. ఇది టీఆర్పీ రేటింగ్‌లో భాగమే అయినా.. పున్నూ-రాహుల్‌లు కూడా లవ్, డేటింగ్, రొమాన్స్ అంటూ కథను బాగానే రక్తికట్టించారు.

punarnavi

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినవచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై రాహుల్ స్పందించాడు. పునర్నవితో తనకు ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదన్నారు. ‘ఆమెను డేటింగ్ కు పిలిచా. కాని ఆమె రానంది.

ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. పునర్నవి అంటే నాకు గౌరవముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఈ షో నాకు చాలా నేర్పింది. వ్యక్తిగత ప్రవర్తన, సహనంతో ఉండటం వంటి అంశాలపై అవగాహన ఏర్పడింది. బహుమతిగా వచ్చిన రూ.50లక్షలతో మంచి ప్లాట్ కొంటాను. ఓట్లేసి గెలిపించిన అభిమానులకందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.