సర్వాంగ సుందరంగా నిర్మల్ అభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్

195
indrakaan reddy
- Advertisement -

నిర్మల్ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పట్టణంలో నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలిసి మ్యాప్ ల ద్వారా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, డీఈ సంతోష్ కుమార్, నాయకులు రాంకిషన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలో అనువైన చోట జాతీయ పతాకం ఏర్పాటు వంటి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇంద్రకరణ్. ఇప్పటికే పట్టణ ప్రగతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించే మోడల్ మార్కెట్ పనులు వెంటనే జరగాలన్నారు. శ్యామ్ ఘడ్ కోట సుందరీకరణ, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలన్నారు.

- Advertisement -