అదేంటీ మనిషి గుడ్లు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా..!అవును నిజంగా వింతే. ఎందుకుంటే ఇప్పటివరకు పక్షులు,పాములు లాంటి సరిసృపాలు గుడ్లు పెట్టడం చూశాం. వినడానికి వింతగానే ఉన్నా ఇది నిజం. ఇండోనేషియాలో ఓ 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతూ అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. గత రెండేళ్లలో అతను మొత్తం 20 గుడ్లు పెట్టాడు.
విషయం తెలిసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. ఇండోనేషియాలోని గోవా ప్రాంతానికి చెందిన అక్మాల్ 2016 ఇలా గుడ్లు పెడుతున్నాడు. తన కుమారుడు పెడుతున్న గుడ్లు మొత్తం పచ్చ సొనగా గానీ లేదా మొత్తం తెలుపు గుడ్డుగా గానీ ఉంటున్నాయని అక్మాల్ తండ్రి రుస్లీ తెలిపాడు. ఇలా చిత్రమైన రీతిలో గుడ్లు పెడుతుండటంతో అక్మాల్‌ని వైద్య పరీక్షల నిమిత్తం తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లినపుడు వైద్యుల కళ్లెదుటే అతను రెండు గుడ్లు పెట్టాడని ఆయన తెలిపాడు.
మొదటి గుడ్డును నేను పగలగొట్టి చూశాను. అందులో మొత్తం పచ్చసొన తప్ప తెలుపు రంగు పదార్థం ఏమీ లేదు” అని రుస్లీ చెప్పాడు.అయితే ఓ మనిషి కడుపులో గుడ్లు తయారు కావడం అసాధ్యమని…గుడ్లను ఉద్దేశపూర్వకంగానే అక్మల్ పురీషనాళంలోకి చొప్పిస్తున్నారేమోనన్న అనుమానాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షేక్ యూసుఫ్ ఆసుపత్రిలో వైద్యులు అక్మాల్ చిత్రమైన పరిస్థితికి గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.