అక్రమ చొరబాట్లు తగ్గాయి: కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్

130
mos
- Advertisement -

దేశంలో అక్రమ చొరబాట్లు తగ్గాయని వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నిత్యానంద్‌… భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల గుండా దేశంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డుతున్న వారి సంఖ్య 2020లో త‌గ్గింద‌ని వెల్లడించారు.

2019తో పోల్చితే 2020లో మాత్రం చాలా త‌క్కువ‌గా 489 కేసులు, 955 అరెస్టులు న‌మోద‌య్యాయని తెలిపారు. 2016లో అక్ర‌మ చొర‌బాట్ల‌కు సంబంధించి మొత్తం 654 కేసులు న‌మోదు కాగా 1,601 మంది అరెస్ట‌య్యారు. 2017లో 456 కేసులు న‌మోద‌వ‌గా 907 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2018లో 420 కేసులు న‌మోదు కాగా 884 మందిని అరెస్ట్ చేశారు. 2019లో కేసులు 500, అరెస్టులు 1,109 రికార్డ‌య్యాయని వెల్లడించారు.

- Advertisement -