కాంగ్రెస్‌కు ఇందిరా శోభన్‌ గుడ్ బై..

269
indira
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌. సీనియర్ నాయకుల తీరు తనను బాధ పెట్టిందని వారి వైఖరికి నిరసనగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

ఏడేళ్లుగా తనకు అండగా ఉన్న కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. మహిళా నాయకురాలిగా తీవ్ర ఆవేదన చెందానని ..త్వరలోనే వైస్ షర్మిల పెట్టే కొత్త పార్టీలో జాయిన్ కానున్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తన వాయిస్‌ని బలంగా వినిపించారు ఇందిరా శోభన్‌. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్గంలో ఉండగా ఇటీవలె ఆయనతో కలిసి పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర ముగిసిన కొద్దిరోజుల్లో ఆమె పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -