హైదరాబాద్‌లో ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు!

57
ipl

ఐపీఎల్‌ 14వ సీజన్‌కు అంతా సిద్ధమవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం పలు వేదికలను ఎంచుకోగా ఇందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజార్‌ ఐపీఎల్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న రాష్ట్రాల్లో ముంబై, పుణే ఉండగా ఇందులో ముంబైలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ప్లేస్‌ని హైదరాబాద్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

అయితే దీనిపై బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఏప్రిల్ 8-12 మ‌ధ్య ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.