భారత్…కరోనా అప్‌డేట్

72
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 98 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,08,12,044 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు చేరాయి. కరోనా టీకా డ్రైవ్‌లో భాగంగా 1,56,20,749 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.