సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీకి వెళ్లే అక్కడి నుంచి వచ్చే పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఇండిగో ప్రకటన ప్రకారం.. సౌదీ అరేబియాలోని జెడ్డా, మదీనా, రియాద్, దమ్మామ్ నగరాలకు నడిచే విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ నాలుగు నగరాల నుంచి భారత్‌కు వచ్చే విమానాలను కూడా రద్దు చేశారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
విమాన సర్వీసుల రద్దుతో సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే ప్రయాణికులు, అక్కడి నుంచి భారత్‌కు తిరిగి రావాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు విమానాల రద్దు వివరాలను ఇండిగో తెలియజేస్తోంది. బాధిత ప్రయాణికులకు అవసరమైన సహాయం అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.
భద్రతా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఇండిగో పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించాలని సూచించింది.
Also Read:సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు..లాయర్‌కు నోటీసులు!

