వాలెంటైన్స్‌ డే .. రూ.999కే విమాన టికెట్!

346
indigo
- Advertisement -

వాలెంటైన్స్ డే స్ సందర్భంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి 4 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 14 వరకు విమాన టికెట్‌ను రూ.999కే బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఇందుకోసం 10 లక్షల సీట్లను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచింది. వీటికి మాత్రమే డిస్కౌంట్ ధర వర్తిస్తుంది. ఈ సీట్లు ముందుగానే బుక్ అయిపోతే ఆఫర్ అందుబాటులో ఉండదు.

టికెట్ బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఆఫర్ సీట్లు అందుబాటులో ఉన్నంత వరకే ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌పై ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే అదనంగా 15 శాతం క్యాష్‌బ్యాక్, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్,ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ల బుకింగ్‌పై 12 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

- Advertisement -