చిరంజీవి కొరటాల మూవీ సమంత!

207
samantha

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిత్రికరణ జరుగుతుంది. కాగా ఈమూవీలో రామ్ చరణ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈమూవీ కోసం చరణ్ 40రోజులు కేటాయించాడని సమాచారం.

ఈమూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సంప్రదించగా ఆమె నో చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో సమంతను కన్ఫామ్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమచారం. వీరిద్దరు కలిసి రంగస్ధలం మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అందువల్లనే చరణ్ సరసన సమంతను కొరటాల ఖరారు చేసినట్టు చెబుతున్నారు. చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈమూవీకి ఆచార్య అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అక్టోబర్ లో ఈమూవీని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రయూనిట్.