రజినీ సినిమాలో అన్ని గెటప్ లా..?

177

ఆ హీరో స్ర్కీన్ మీద కనబడితే కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్‌ బద్ధలైపోవాల్సిందే. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది  హీరోల్లో ఆయన ఒకరు. ఆయనే రజినీకాంత్‌. మామూలుగా ఈయన ఒక్క గెటప్ తో కనబడితేనే సంచలనం.

అలాంటిది ఆయన సినిమాలో రజనీకాంత్‌ 5 విభిన్న పాత్రల్లో కనిపిస్తే..? ఇక అభిమానులకు పండుగే పండుగ. రజనీ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రోబోకు సీక్వెల్‌గా ‘2.o’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా క్లైమాక్స్‌కు రాగా, దీనికి సంబంధించిన ఓ ఇంట్రస్ట్రింగ్‌ న్యూస్‌ ఇప్పుడు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తుంది.
2.0: Rajinikanth to play 5 roles, Akshay Kumar to sport 12 looks?
అయితే ఈ సినిమాలో బాలీవుడ్‌ ‘కిలాడీ’ అక్షయ్‌కుమార్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడనే విషయం కూడా తెలిసిందే.  అయితే ఈ మూవీలో రజనీ 5 పాత్రలలో నటిస్తున్నాడట. అంతేకాకుండా అక్షయ్‌ కూడా  12 డిఫరెంట్ కారెక్టర్‌లలో కనిపించనున్నాడని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఇప్పటికే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరింత హైప్‌ను పెంచాడు దర్శకుడు శంకర్‌.

అయితే ‘రోబో’ చిత్రంలో కూడా రజనీ మూడు పాత్రల్లో కనిపించారు. మరి తాజా చిత్రంలో ఎలా కనిపిస్తారో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అమీ జాక్సన్‌, సుధాన్సు పాండే, అదిల్‌ హుస్సేన్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.