బాలీవుడ్‌లో భారత క్రీడారంగంలో తమదైన ముద్ర వేసిన క్రీడాకారులు సైనా నెహ్వాల్ – సానియా మీర్జా – మిథాలీ రాజ్ ల బయోపిక్‌లు తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బయోపిక్ హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మహానటి బయోపిక్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్,యాత్ర బయోపిక్ లను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనూ బయెపిక్‌లు భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మ్యాన్, రన్‌బీర్ కపూర్ నటించిన సంజు చిత్రాలు బిగ్ హిట్‌గా నిలిచాయి.
దీంతో తెరపైకి మరిన్ని బయోపిక్ లను తెచ్చేందుకు బాలీవుడ్ దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బయోపిక్ పై భారీ నెలకొన్నాయి. సానియా పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. సానియా టెన్నిస్‌లో సాధించన విజయాలు,తన కెరీర్‌లోని ఒడుదోడుకులు, గ్లామర్ డాల్ గా సానియాకున్న పేరు, తన ఎంగేజ్ మెంట్ బ్రేకప్ చేసుకొని పాక్ క్రికెటర్ షోయబ్‌ను పెళ్లి చేసుకోవడం, తనపై విమర్శలు, జాతీయత. ఇటువంటి అంశాలతో ఈ మూవీని రూపొందించనున్నారు. ఈ బయోపిక్ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.