ఉప్పల్​లో రోహిత్ సేన..

34
- Advertisement -

ఈ నెల 18న(రేపు) భారత్ – న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఉప్పల్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్ చేరుకోగా తాజాగా భారత్ టీమ్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది. తిరువనంతపురం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన క్రికెటర్లను భారీ పోలీస్ బందోబస్తు మధ్య సిటీలోని పార్క్ హయత్ హోటల్​కు తరలించారు.

ఇవాళ భారత్ టీమ్ ప్రాక్టీస్‌ చేయనుండగా కీవిస్ ఆటగాళ్లు సోమవారం సాయంత్రం ఉప్పల్​ స్టేడియంలో ప్రాక్టీస్​ చేశారు. మెయిన్​ గ్రౌండ్​లో గంట పాటు వామప్​, క్యాచింగ్​ సెషన్ తర్వాత ఫ్లడ్​ లైట్స్​ వెలుతురులో రెండు గంటల పాటు నెట్​ ప్రాక్టీస్​లో పాల్గొన్నారు.

నాలుగు సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్‌కి ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. టికెట్లన్ని ఆన్‌లైన్‌ ద్వారా అమ్మగా మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌ ముగిసిన తర్వాత గమ్యస్ధానాలకు చేరుకునే విధంగా మెట్రో రైల్ సమయాన్ని కూడా పొడగించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -