విజయ్ ఆంటోనికి తీవ్రగాయాలు..

44
- Advertisement -

హీరో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం విజయ్ హీరోగా బిచ్చగాడు 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా సూటింగ్ మలేషియాలో జరుగుతుండగా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బోటులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ ఆంటోనీ తీవ్రంగా గాయపడగా ఆయనను హుటాహుటిన కౌలాలంపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుండగా ప్రాణాపాయం లేనట్లు సమాచారం.

2016లో విడుదలైన బిచ్చగాడు భారీ సక్సెస్ సాధించింది. తమిళ్, తెలుగు రెండు చోట్ల విజయం సాధించగా ఈ సినిమాతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు విజయ్. తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్‌పై బిచ్చగాడు 2ని తెరకెక్కిస్తున్నారు విజయ్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -