బంగారం ధర మరింత పైపైకే..

237
Gold Rate Today Live
- Advertisement -

పసిడి పరుగు జోరు ఏమాత్రం ఆగడం లేదు. రికార్డు స్ధాయిలో పెరుగుతున్న పసిడి ధరతో వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. హైదరాబాద్,కోయంబత్తూరు, విజయవాడ, మధురై, భువనేశ్వర్, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 57,820గా ఉంది.

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ.1365 పెరిగింది. పసిడి ధరతో పోటీ పడుతూ వెండికూడా భారీగా పెరిగింది.కిలో వెండి ధ‌ర ఒక్క‌రోజే ఏకంగా రూ.5,972 పెరిగి ….రూ.72,726కు చేరింది.

అంత‌ర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా ఔన్స్ బంగారం ధర రెండువేల డాలర్లను దాటింది. ఔన్స్ బంగారం ధ‌ర 2,032 అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉంది.రోజురోజుకు పెరుగుతు కరోనా కేసుల ఆందోళనతో బంగారానికి డిమాండ్ పెరిగిపోయింది. పెట్టుబడులకు బంగారమే సురక్షితమన్న సెంటిమెంట్‌తో బంగారం ధరలు ఆల్ టైమ్ హైంకి చేరాయి.

- Advertisement -