రైల్వే రిజర్వేషన్‌లో కీలక మార్పులు రానుంది రైల్వే శాఖ. ఇకపై సాధారణ రిజర్వేషన్‌కూ ఆధార్ తప్పనిసరి కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలు కానుంది.మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో రిజర్వేషన్ చేసుకునే వీలు కల్పించారు.
ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లో ఈ విధానం అమలులో ఉంది. కానీ ఇకపై సాధారణ రిజర్వేషన్‌లకూ విస్తరించనుంది. రైల్వే శాఖ ప్రకటనలో తెలిపిన ప్రకారం, రిజర్వేషన్ సౌకర్యాలు సామాన్య ప్రయాణికులకు చేరేలా, అక్రమంగా ఉపయోగించబడకుండా కాపాడే ఉద్దేశ్యంతో, అక్టోబర్ 1, 2025 నుండి సాధారణ రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు కేవలం IRCTC వెబ్‌సైట్/యాప్ ద్వారా ఆధార్ ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకోవచ్చు అని పేర్కొంది.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఏజెంట్లు, బాట్స్ ద్వారా జరిగే తప్పుడు బుకింగ్‌లను అరికట్టడమే. జూలై 2025లో తత్కాల్ టికెట్లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేసిన రైల్వే, ఇప్పుడు దీన్ని సాధారణ రిజర్వేషన్‌లకు కూడా విస్తరించింది. అక్టోబర్ 2025కి ముందే తమ IRCTC అకౌంట్లను ఆధార్ నంబరుతో లింక్ చేసుకోవాలని రైల్వే సూచిస్తోంది. ముఖ్యంగా పీక్ ట్రావెల్ సీజన్లలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసే వారికి ఇది కీలకంగా మారనుంది. ఈ కొత్త నిబంధన టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేసి, నిజమైన ప్రయాణికులకు సమాన అవకాశాలు కల్పిస్తుందని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు.
Also Read:కిష్కింధపురి..వసూళ్ల జోరు!

