బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇక రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. నామినేషన్స్‌లో భాగంగా ప్రతి ఇంటి సభ్యునికి ఇద్దరు సభ్యుల్ని నామినేట్ చేసే హక్కు ఉంటుంది. ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని భావించిన ఇద్దరు సభ్యుల్ని తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెయింట్‌ని పూయాలి అని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే కెప్టెన్ సంజనని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు అని తెలిపాడు.
ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియని తనూజ స్టార్ చేసింది. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్‌ను చేస్తున్నట్లు తెలిపింది. ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ బిహేవియర్ నాకు నచ్చలేదు.. ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడారు.. అది నచ్చలేదు అని చెప్పగా దీనికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. ఆల్‌మోస్ట్ ఇక్కడ ఒకరికి ఒకరు స్ట్రేంజర్స్‌యే.. అది ఫస్ట్ డే మనకి కుకింగ్ వచ్చినప్పుడు.. ఆ ముందు రోజు ప్రియ పాపం తినాలనుకున్నప్పుడు మీకు ఫుడ్ వచ్చింది.. అరెయ్ రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేయించుకొని తినేదాన్ని అంది.. ఇప్పుడు వండించుకుంటే మళ్లీ మిగిలిపోతుంది ఇబ్బంది పెట్టడం ఎందుకా అని ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసింది ప్రియ అని చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఒకానొక దశలో హరీష్ తీవ్రంగా ఫైర్ అయ్యాడు. హరీష్ కంప్లీట్‌గా వినండి అని తనూజ అంటుంటే మీరు రాంగ్ స్టేట్‌మెంట్స్ పాస్ చేయొద్దు అంటూ మరింత రెచ్చిపోయాడు. ఇక తన రెండో నామినేషన్‌కి ఫ్లోరా సైనిని సెలక్ట్ చేసింది తనూజ.
తర్వాత మర్యాద మనీష్ ముందుగా భరణిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు. భరణిది అయిపోగానే రీతూ చౌదరి నా రెండో నామినేషన్.. అంటూ మర్యాద చెప్పాడు. మీరు ఇంటికి ఊరికే ఊరికే వస్తూ రూల్స్ అన్నీ తెలిసే బ్రేక్ చేయిస్తున్నారని నాకు ఒక డౌట్ ఉంది.. దాని వల్ల చాలా గొడవలు అయ్యాయి.. ఆ డౌట్ నాకు రియాలిటీ కూడా అయిపోయింది అని చెప్పాడు. ఈ క్రమంలో రీతూ – మనీష్‌కు గొడవ జరుగుతుండగా డీమన్ పవన్ మరోసారి మాట్లాడాడు. ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నా నేను పిలిచినప్పుడు అయితే తను వచ్చింది.. డిషెస్ క్లీన్ చేయడంలో తను గుడ్.. అంటూ పవన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దీంతో రీతూ రెచ్చిపోయింది. ఇది చూసి ఇంకా అరవండి.. వాయిస్ పెంచండి అంటూ మర్యాద రెచ్చగొట్టాడు . దీంతో నా గొంతు నా ఇష్టం నేను అరచుకుంటా..నువ్వు ఒక షిట్ పాయింట్ చేసి.. నామినేషన్ వేస్తే యాక్సెప్ట్ చేయాలా అంటూ రీతూ గొవడపడింది.
Also Read:భద్రకాళి..యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్

