మార్చి 23నుంచి ఐపీఎల్..

279
ipl matches
- Advertisement -

ఎప్రిల్ లో దేశవ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లు ఇత‌ర దేశాల్లో నిర్వ‌హించ‌నున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆవార్త‌ల‌కు బ్రేక్ వేసింది బీసీసీఐ. ఈసంవ‌త్స‌రం కూడా ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ఇండియాలోనే నిర్వ‌హించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మార్చి 23వ తేది నుంచి టోర్నిని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. త్వ‌ర‌లోనే టోర్ని పూర్తి షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ).

ipl2019

ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై చర్చించడానికి వినోద్ రాయ్, డయానా ఎడుల్జీల నేతృత్వంలోని సీఓఏ మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర రాష్ట్ర ఏజెన్సీల అధికారుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఐపీఎల్ 12ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపింది బీసీసీఐ. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలిసారి 2009లో టోర్నీ సౌతాఫ్రికాలో జరిగింది. ఆ తర్వాత 2014లో సగం టోర్నీ యూఏఈలో, మిగతా సగం ఇండియాలో జరిగింది. ఈసారి కూడా అదే జరగనుందని వార్తలు వచ్చాయి. అలాగే మే 30నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఐపిఎల్, వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల‌కు 15 రోజులు గ్యాప్ ఉండేలా షెడ్యూల్ త‌యారు చేస్తున్నారు.

- Advertisement -