పార్లమెంట్‌లో ఆన్‌పార్లమెంటరీ పదాలు వాడొద్దు.

68
parliament
- Advertisement -

జులై 18నుంచి జరగనున్న వర్షా కాల సమావేశాన్నికి పార్లమెంట్‌ సిద్దమవుతోంది. తాజాగా పార్లమెంట్‌లోని లోక్‌సభ సెక్రటేరియెట్‌ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్‌ విడుదల చేశారు. ఈ బుక్‌లెట్‌ లో ఉన్న మార్గదర్శాకలను సభలోని ప్రతి సభ్యుడు పాటించాలని, వాటితో పాటుగా కొన్ని నిషేద్ధిత పదాల జాబితాను విడుదల చేసింది. ఇకపై జుమ్లా జీవి, కొవిడ్‌ స్ప్రెడర్‌, స్నూప్‌ గేట్‌, వంటి పదాలను నిషిద్ధం. దీంతో పాటుగా అతి సాధరణంగా ఉపయోగించే పదాలను కూడా సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత పదాలను వాడకూడదు. వీటితో పాటుగా శకుని, తానాషా, వినాశ పురుష్‌, ఖలిస్థానీ, ద్రోహ చరిత్ర, చంచా, చంచాగిరి, పిరికివాడు, క్రిమినల్‌, మొసలి కన్నీరు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, దాదాగిరి, లైంగిక వేధింపులు, విశ్వాసఘాతకుడు వంటి నూతన పదాలను సభ్యులు తమ ప్రసంగంలో వినియోగించకూడదని బుక్‌లేట్‌లో పొందుపర్చారు.

సమయానుకులంగా కొన్ని పదాలు, హావభావాలను పార్లమెంట్‌ ఉభయ సభలు, రాష్ట్రాల చట్ట సభల్లో వినియోగించకుండా వాటిని అమర్యాదకరమైనవని నిషేదిస్తారు. రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌, శాసన సభ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగించి సభ్యులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.

- Advertisement -