భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా భారత సైన్యం తొలి 3డీ ప్రింటింగ్ హౌస్ నిర్మించింది. అహ్మదాబాద్‌కు చెందిన గోల్డెన్ కటార్ డివిజన్ లో ఈ నిర్మాణం చేపట్టారు. దీనిని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ మరియు ఎమ్‌ఐకాబ్ అనే ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 71చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేవలం 12వారాల వ్యవధీలో పూర్తిచేశారు.
3డీ నిర్మాణాలు విపత్తును తట్టుకునే విధంగా అంటే జోన్-3 భూకంప లక్షణాలు ఉన్న స్థలంలో మరియు గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా తయారు చేశారు. ఇలాంటి నిర్మాణాలు సాయుధ దళాల సిబ్బందికి పెరుగుతున్న వసతి అవసరాలకునుగుణంగా తీర్చడానికి ప్రయత్నించే భాగమని నిర్మాణ సంస్థలు తెలియజేశాయి.
3డీ సాంకేతికతతో కాంక్రీట్‌ను లేయర్ బైలేయర్‌పద్ధతిలో నిర్మాణం కొనసాగిందని తెలిపారు. ఇది పూర్తిగా కాకుండా ఒకే సంవత్సరం కోసం రూపొందించబడినాయని తెలిపారు. ఇటువంటి లఢఖ్ వంటి ప్రాంతాల్లో భారతసైన్యం కోసం నిర్మించనున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి…