ఉసిరి గురించి ఇవి తెలుసా..

264
- Advertisement -

ఉసిరికాయ చాలా మంచిదని చాలా మంది అంటారు. కానీ అంతే మంది వాటిని తినలేరు. ఎందుకంటే కొంచెం పుల్లగా మరికొంచెం వగరుగా ఉండటమే ప్రధాన కారణమని పలు సర్వేల్లో వెల్లడైంది. అయితే సనాతన భారతీయులు మాత్రము వీటికి ఔషధ గుణం కలిగి ఉంటాయని అందుకే ఆయుర్వేదంలో వాడుతుంటారు. వీటి ద్వారా మానవుల శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. చెట్టు వేరు నుంచి మొదలుకొని అన్ని ప్రతి పనిలో ఉసిరి చెట్టును మనం విరివిగా వాడుతుంటాము.

దీపావళి పండుగ సమయంలో ఉసిరి ఆకులను కానీ కాయలను కానీ కనీసం చెట్టు కొమ్మనైన సరే ఇంట్లోకి తెచ్చుకొంటాము. ఉసిరి వివిధ రూపాల్లో మనకు లభ్యమవుతుంది. మరియు వీటిని వివిధ వంటల్లో కూడా ఉపయోగిస్తాము. ముఖ్యంగా ఉసిరి ఊరగాయ(తొక్కు) రూపంలో ఉపయోగిస్తాము. ఉసిరిని వివిధ రూపాల్లో తింటుంటారు. పొడి రూపంలో, తీపి పానీయాలుగా తీసుకుంటారు.

అయితే ఉసిరిలో పోషకాలు తగ్గకూడదంటే వీటిని ముక్కలుగా కోసి కొంచెం ఉప్పు జల్లి తింటే మంచిది. మార్కెట్ లో ఉసిరి మిఠాయిలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని కూడా తినొచ్చు.

ఉసిరిని ఉదయం పానీయంగా తీసుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. రెండు ఉసిరికాయలను తీసుకుని వాటిని ముక్కలుగా కోయండి. వీటిని కొన్ని నీళ్లు పోసి ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవాలి. కావాలనుకుంటే దీనిలోని గుజ్జును, పీచుపదార్థాలను పారేయొచ్చు. దీనికి కాస్త మిరియాల పొడిని, నల్ల ఉప్పును కలపండి. తియ్యగా తాగాలనుకుంటే దీనిలో కొద్దిగా తేనెను వేయండి. ఈ పానీయాన్ని వెంటనే తాగడం మంచిది.

ఉసిరిలో విటమిన్ సి, పాలీఫెనాల్స్, టానిన్లు, ఖనిజాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు వెల్లడించారు. ఉసిరికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైపోగ్లైసీమిక్, యాంటీ హైపర్ గ్లైసెమిక్, యాంటీ హైపర్ లిపిడెమిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయని కనుగొన్నారు.

Also Read:IND vs SA:సఫారీ గడ్డపై చెత్త రికార్డ్!

ఉసిరిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అందుకే ఉసిరి తినడం వల్ల బరువును చాలా వరకు కోల్పోతాము. ఉసిరికాయలో ఉండే పోషకాలు జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఉసిరిలో కాంప్లెక్స్ టానిన్‌లు, ఎల్లాజిటానిన్‌లు కోరిలాగిన్, జెరానిన్, చెబులాజిక్ యాసిడ్, ఎలియోకార్పుసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే ఉసిరిని రోగనిరోధక శక్తిని పెంచే మంచి వనరుగా పిలుస్తారు.

- Advertisement -