44 దేశాల్లో భారత్ కరోనా వేరియంట్..

209
corona india
- Advertisement -

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతుండగా రోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక భారత్‌లో గుర్తించిన కొవిడ్‌-19 బీ.1.617 వేరియంట్‌ను ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఈ రకం వైరస్‌ కారణంగానే బ్రిటన్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదుకాగా కొత్త రకం వేరియంట్ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించారు. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, ఇది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈ వైరస్ తేలికగా వ్యాపిస్తుందని భారత్‌లో కేసులు,మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్‌ సైతం కారణమని వివరించింది. అమెరికా తర్వాత దాదాపు 23 మిలియన్ల కొవిడ్‌ కేసులతో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

- Advertisement -