కామన్వెల్త్‌లో భారత్‌ జోరు….పీ వీ సింధుకు స్వర్ణం

93
pv sindhu
- Advertisement -

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ తరపున తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21-15, 21-13 తో అలవోకగా నెగ్గింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.

కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. పీవీ సింధు పతకాల జోరు కొనసాగుతుంది. 2014 కామన్వెల్త్‌లో కాంస్యం గెలిచిన సింధు, వరుసగా 2016 రియో ఒలింపిక్స్‌ లో రజతం, 2018లో ఆసియా గేమ్స్‌లో రజతం సాధించారు. 2018 కామన్వెల్త్ లో రజతం, 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకొంది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

- Advertisement -