పాక్ డ్రోన్ దాడిని తిప్పికొట్టిన భారత సైన్యం

15
- Advertisement -

జమ్మూ ఖశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు పదేపదే ఉల్లంఘించాయి. ఇక గురువారం అర్థరాత్రి పాక్ డ్రోన్‌ దాడులు కలకలం రేపగా ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు తగిన సమాధానం ఇచ్చాం అని భారత సైన్యం పేర్కొంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి దాడులకు పాక్ సైన్యం పాల్పడగా వాటిని తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉందని తెలిపింది. అన్ని దుష్ట కుట్రలకు బలంగా ప్రతిస్పందిస్తామని తెలిపింది.

జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలు, జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్‌లు, క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని, దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని తెలిపింది.

Also Read:కేటీఆర్..ఖమ్మం టూర్ షెడ్యూల్

- Advertisement -