పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం

45
- Advertisement -

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది భారత్. పాక్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. ఓపెనర్లు యస్తికా భాటియా (20 బంతుల్లో 17 పరుగులు), షెఫాలీ వర్మ (25 బంతుల్లో 33 పరుగులు) భారత్ కు మంచి శుభారంభం ఇచ్చారు. జమియా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో (53*) అదరగొట్టి భారత్ ను విజయతీరాలకు చేర్చింది.

ఇక అంతకముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది పాక్‌. పాక్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ హాఫ్ సెంచరీతో 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. చివర్లో ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేయడం పాక్‌ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది.

స్కోర్లు..

పాకిస్థాన్-20 ఓవర్లలో 149/4
భారత్-19 ఓవర్లలో 151/3

ఇవి కూడా చదవండి..

- Advertisement -