ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విజయంతో అగ్రస్ధానంలో నిలిచింది టీమిండియా. ఇప్పటికే 70శాతం విజయాలతో ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో భారత్ నంబర్‌వన్‌గా ఉండగా ఇక ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది.
మూడో టెస్టులో ఇంగ్లాండ్ నిర్దేషించిన 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు సిరీసులో 1-2తో వెనుకబడటంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా, డ్రా చేసుకున్నా భారత్ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది.