సమంత @ 11

306
samantha
- Advertisement -

ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది. 2010లో ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడులోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన సత్తాచాటుతూ అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు.

యంగ్ హీరో నాగచైతన్యని ప్రేమ పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టిన సామ్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో సామ్ బిజీగా ఉంది. రీమేక్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన సమంత..సక్సెస్‌కు చిరునామాగా నిలిచింది.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‎కి జంటగా రామలక్ష్మి పాత్రలో అద్భుత నటనతో విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తొలిసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తనకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇన్‌స్టాగ్రాములో సమంతను ఫాలో అయ్యేవారి సంఖ్య 15 మిలియ‌న్స్‌కు చేరింది. హీరోలతో స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్న స‌మంత త‌క్కువ టైంలోనే ఇంత మంది ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకుని సోషల్ మీడియా క్వీన్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఇండస్ట్రీలోకి ఎంటరై 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్‌ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.

- Advertisement -