బి‌ఆర్‌ఎస్ తోనే మార్పు తథ్యం !

521
- Advertisement -

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన బి‌ఆర్‌ఎస్ కు సంబంధించిన చర్చే జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని తుడిచివేసేందుకు దేశ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన కే‌సి‌ఆర్..ఇక బి‌ఆర్‌ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే దేశ రాజధాని డిల్లీలో బి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ హాజరు కాగా పలువురు జాతీయ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. వారిలో యూపీ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి తో పాటు రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం కే‌సి‌ఆర్ వివిధ పార్టీ నేతలతో ముచ్చటించారు. అయితే దేశ రాజకీయాల్లోకి బి‌ఆర్‌ఎస్ ఎంట్రీతో అన్నీ వైపులా నుంచి మద్దతు లభిస్తుడడం.. నిజంగా శుభ పరిణామమే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను దేశ రాజకీయాల్లో ఎదుర్కొనే సత్తా కేవలం కే‌సి‌ఆర్ కు మాత్రమే ఉందని, ఆయా పార్టీల నేతలు ధృడ నిశ్చయంతో ఉన్నారు. ఇక తెలంగాణ మోడల్ అభివృద్ది దేశంలో తధ్యం అని దేశ ప్రజలు కూడా బి‌ఆర్‌ఎస్ పై సానుకూలంగానే ఉన్నారు.

ఇదిలా ఉంచితే కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యాలు చేశారు. ” దేశంలో గుణాత్మక మార్పు కోసం కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారని, ఇక తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పథకాలు బి‌ఆర్‌ఎస్ వేదికగా దేశానికి పరిచయం కాబోతున్నాయని కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు. అయితే ముందే ఖరారు అయిన సమావేశాల కారణంగా కార్యాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరు కాలేకపోయానని చెప్పుకొచ్చారు కే‌టి‌ఆర్. ఇక రాబోయే కాలంలో బి‌ఆర్‌ఎస్ అంటే ఏంటో చూపిస్తామని, ” అప్ కి బార్ కిసాన్ సర్కార్ ” అనేది పార్టీ స్లో గన్ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో సమూల మార్పు కోసం ఎంట్రీ ఇచ్చిన బి‌ఆర్‌ఎస్.. రాబోయే రోజుల్లో నేషనల్ పాలిటిక్స్ లో సరికొత్త ఒరవడి సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి…

మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుండే..

బండి సంజయ్.. సొంత జిల్లాలో ఇంత వ్యతిరేకతనా ?

బీజేపీకి బీఆర్ఎస్ ఫీవర్ :కవిత

- Advertisement -