PM Modi:టాప్ 3లో భారత్

51
- Advertisement -

77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని. భారతీయ యువత టెక్నాలజీ విషయంలో ముందున్నారని, భారత్‌లో యువతకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆధునికతవైపు దేశం అడుగులు వేస్తోందని చెప్పారు.

దేశంకోసం ఎంతో మంది త్యాగం చేశారని…. అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్రం అన్నారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపే చూస్తోందని.. గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. యువతే భారత్‌కు బలమని అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పీఎం స్వనిధి పథకం ద్వారా 50వేల కోట్లు ఖర్చు చేశామని ప్రధాని చెప్పారు. రూ. 4లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం అన్నారు.

Also Read:ఆ సమస్యలన్నీ బ్రెయిన్స్ స్ట్రోక్ లక్షణాలే..!

సుస్థిర శక్తివంతమైన ప్రభుత్వం భారత్‌కు అవసరం అని…. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని, మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుందన్నారు. మణిపుర్‌లో శాంతి స్థాపనకు కేంద్రం సహకరిస్తుందని, మణిపుర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వెల్లడించారు.

రాబోయే కాలంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి దేశ ప్రజలు గర్వించేలా చేస్తామని…ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుందని, భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

Also Read:KTR:కాంగ్రెస్ నేతలు…రాబంధులు

- Advertisement -