భారత్‌ – జింబాబ్వే రెండో వన్డే..

131
- Advertisement -

ఇవాళ భారత్ – జింబాబ్వే మధ్య రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని సొంతం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. రెండో వన్డేలో రాహుల్‌ టాస్‌ గెలిస్తే.. ఆటగాళ్లందరికీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కోసం తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టు పగ్గాలందుకున్న రాహుల్‌కు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి అతడిపైనే నిలిచింది.

ఇక ఆర్నేళ్ల విరామం తర్వాత గత మ్యాచ్‌ బరిలోకి దిగిన దీపక్‌ చాహర్‌.. కొత్త బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. ఆర్నెళ్ల క్రితం ఎక్కడ ఆపాడో.. తిరిగి అక్కడి నుంచే ప్రారంభించిన దీపక్‌.. గాయం తన లయ దెబ్బతీయలేదని నిరూపించుకున్నాడు. స్వింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై పదే పదే ఒకే చోట బంతులేస్తూ టెస్టు మ్యాచ్‌ తరహా బౌలింగ్‌తో ఫలితం రాబట్టాడు. అతడికి హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చక్కటి సహకారం అందించగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లుతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డే ఆడిన జట్టుతోనే భారత్‌ మరోసారి బరిలోకి దిగనుంది. ఇక జింబాబ్వే సైతం భారత్‌ను ఓడించి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

- Advertisement -