ఉప్పల్‌లో నేడే తొలి టీ 20….

542
india vs westindies
- Advertisement -

ఉప్పల్ వేదికగా భారత్- వెస్టిండీస్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఇవాళ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌ పిచ్ కావడంతో పరుగుల వరద పారడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

భారత జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ కలిగిఉండటంతో కోహ్లీ సేన గెలుపు నల్లేరుపై నడకేకానుంది. టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వెస్టిండీస్‌కు సమస్యగా మారింది. ఎవిన్‌ లూయిస్, లెండిల్‌ సిమన్స్, హెట్‌మైర్, కెప్టెన్‌ పొలార్డ్‌లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డిసెంబర్ 6 బ్లాక్ డే కావడంతో… ఉప్పల్ స్టేడియంలో 300 అత్యాధునిక సిసి కెమరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అవుట్ ఫీల్డ్ తో పాటు 30 యార్డ్ సర్కిల్ వీఐపి గ్యాలరీ, అభిమానులు కూర్చోని వీక్షించేందుకు అన్ని గ్యాలరీస్, పావలిన్ ఎండ్స్ లలో భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 40వేల మంది అభిమానులు వీక్షించే కెపాసిటి ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియంలో భారీ స్ధాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు రాచకొండ పోలీసులు.

Uppal stadium to host india vs westindies 1st T20I Today….Uppal stadium to host india vs westindies 1st T20I Today….

- Advertisement -