పాక్‌పై భారత్‌ భారీ స్కోరు..

202
India vs Pakistan, 4th Match
India vs Pakistan, 4th Match
- Advertisement -

బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్నభారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 48 ఓవర్లకు 3 వికెట్లు కొల్పోయి 319 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌ అరంభ ఓవర్లలో దూకుడుగా పరుగులు చేయలేకపోయింది. అయితే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ ను 48 ఓవర్లకు కుదించారు.  ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్లు వికెట్ల పోకుండా జాగ్రత్తగా ఆడారు. అర్ధశతకం బాదిన శిఖర్‌ ధావన్‌ (68; 65 బంతుల్లో 6×4, 1×6) షాదాబ్‌ వేసిన 25 ఓవర్‌ 3వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి అజార్‌అలీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో సారథి విరాట్‌కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ అండతో రోహిత్ శర్మ చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించాడు. అయితే శతకానికి 9 పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌శర్మ (91; 119 బంతుల్లో 7×4, 2×6)ను విరాట్ కోహ్లీ తొందరపాటు పరుగుతో ఔట్ చేయడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత శతకానికి దూరం చేసింది. ఇన్నింగ్స్‌లో షాబాద్‌ వేసిన 37వ ఓవర్‌ 4 బంతిని కోహ్లీ ఆడాడు. బంతి షార్ట్‌పిచ్‌ వరకే వెళ్లింది. దీన్ని చూసుకోని కోహ్లీ మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ను సింగిల్‌కు పిలిచాడు. ఐతే అక్కడే ఉన్న బాబర్‌ ఆజామ్‌ విసిరిన బంతిని అందుకొన్న కీపర్‌ సర్ఫరాజ్‌ వికెట్లను గిరాటేశాడు. రోహిత్‌ శర్మ డైవ్‌ చేసినప్పటికీ బ్యాట్‌ కాస్త గాల్లో ఉండటంతో అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు.

ఆ తరువాత వచ్చిన యవరాజ్ సింగ్‌ ఎక్కడా తగ్గకుండా ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. కేవలం 29 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న యువరాజ్‌(53)ను హాసన్‌ అలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాడు. అనంతరం వచ్చిన హార్థిక్ పాండ్యా 48వ ఓవర్లో మూడు వరుస సిక్సర్లు.. కోహ్లీ ఫోరు బాదడంతో చివరి ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. పాక్‌ బౌలర్లో అమీర్ మరోకసారి తన బౌలింగ్ ప్రతాపాన్ని చూపించాడు. అయితే చివరి ఓవర్లలో అమీర్‌కు కాలు పట్టేయడంతో రిటైర్‌ హర్టగా మైదానం వీడాడు. భారత్ బ్యాటింగ్.. రోహిత్ శర్మ(91),శిఖర్ ధావన్ (68), యువరాజ్ సింగ్ (53), కోహ్లి 81, పాండ్యా 20 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

- Advertisement -