హులాలాలా హులాలాలా… రాంబాబు

264
Hoo Laa Laa Full Song from Ungarala Rambabu
Hoo Laa Laa Full Song from Ungarala Rambabu
- Advertisement -

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన పరుచూరి కిరీటి నిర్మాత‌గా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై నటిస్తున్న చిత్రం `ఉంగరాల రాంబాబు` ఈ సినిమా మొద‌టి సాంగ్‌ హులాలాలా హులాలాలా…ను శ‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. పాత్రికేయులంద‌రూ క‌లిసి సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌ను ఇటీవ‌ల ప‌ర‌మ‌ప‌దించిన ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావుకు అంకితం చేశారు. ముందుగా దాస‌రి నారాయ‌ణ‌రావు గారి ప‌టానికి పూలు జల్లి ఆయ‌న ఆత్న శాంతించాల‌ని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

హీరో సునీల్ మాట్లాడుతూ – “దాస‌రిగారితో మంచి అనుబంధం ఉండేది. ఆయ‌న న‌న్నెప్పుడూ అందాల‌రాముడు అని పిలిచేవారు. ఎప్పుడైన మాన‌సిక ధైర్యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర‌కెళ్ళి ఓ ప‌ది నిమిషాల పాటు కూర్చొంటే స‌రిపొయేది. ఆయ‌న ఈరోజు కూడా మా వేడుక‌కు హాజ‌రైన‌ట్లుగానే భావిస్తున్నాను. ఓ క‌మెడియ‌న్‌గా, హీరోగా మారిన త‌ర్వాత నా చిత్రాల్లో నా కామెడితో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ వ‌చ్చాను. అయితే ఉంగ‌రాల రాంబాబు సినిమా చేయ‌డం, ఓ అర్థ‌వంత‌మైన సినిమా చేసిన‌ట్లుగా భావిస్తున్నాను. సినిమా రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాలు ప్రేక్ష‌కులు చాలా అర్థ‌వంతంగా న‌వ్వుకుంటారు. ఇలాంటి సినిమా చేయ‌డానికి కార‌ణం నిర్మాత‌లు ప‌రుచూరి కిరిటీ, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్‌గారే కార‌ణం. అందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌గారితో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నాకు, ప్ర‌కాష్‌రాజ్‌గారికి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌లాంటి స‌న్నివేశాలుంటాయి. ప్ర‌కాష్‌రాజ్‌గారి క్యారెక్ట‌రైజేష‌న్ గొప్ప‌గా ఉంటుంది. ప్ర‌తి మూడురోజుల‌కొక‌సారి సినిమాల్లోని మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తాం. గురువు గారికి పాత్రికేయ‌లంటే చాలా ఇష్టం. మ‌నల్ని స్టార్స్ ని చెయ్య‌టం కొసం మీడియా సోద‌రులు క‌ష్ట‌ప‌డుతుంటారు. సో వాళ్ళ‌ని ఎప్పుడూ మ‌ర్చిపోవ‌ద్దు అని నాతో అనేవారు అందుకే పాత్రికేయుల‌తో సాంగ్ విడుద‌ల చేసి ఈ సాంగ్‌ను దాస‌రిగారికి అంకిత‌మిస్తున్నాం“ అన్నారు.

ప‌రుచూరి కిరిటీ మాట్లాడుతూ – “ఈ సినిమాలో సునీల్ గారు అద్భుత‌మైన డ్యాన్స్ చేశారు. జిబ్రాన్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

- Advertisement -