IND VS NZ:అసలు మజా ఆగయా!

18
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో టీమిండియాపై పైచేయి సాధిస్తూ వచ్చిన కివీస్ జట్టుతో రోహిత్ సేన తలపడనుంది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలు కానుంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలను ఓడించి ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా న్యూజిలాండ్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2003 లో జరిగిన వరల్డ్ కప్ లో చివరిగా కివీస్ జట్టును ఓడించింది టీమిండియా.

ఆ తరువాత 2007, 2011, 2015, 2019 ఇలా వరల్డ్ కప్ రికార్డులను పరిశీలిస్తే టీమిండియా పై కివీస్ ఎప్పుడు కూడా పైచేయి సాధిస్తూ వచ్చింది. రాహుల్ ద్రావిడ్, ఎం‌ఎస్ ధోని, విరాట్ కోహ్లీ.. ఇలా ముగ్గురు దిగ్గజ కెప్టెన్లు జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పటికి కివీస్ ను ఓడించలేకపోయారు. దీంతో ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియాలో ఎలాంటి ఫలితానిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇరు జట్లు కూడా చెరో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లు కూడా అన్నీ విభాగాల్లోనూ అత్యంత పటిష్టంగా ఉన్నాయి. 2019 సెమీ ఫైనల్ లో కివీస్ తో జరిగిన మ్యాచ్ ను అభిమానులు అంతా తేలిగ్గా మర్చిపోలేరు. ఆ మ్యాచ్ ఓటమితో భారత్ వరల్డ్ కప్ రేస్ నుంచి నిష్క్రమించింది. మరి ఈసారి వరల్డ్ కప్ లో కివీస్ పై విజయం సాధించి ప్రతికారం తీర్చుకుంటుందో లేదో చూడాలి. అయితే ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Also Read:KTR:119 స్థానాల్లో ఈటల పోటీ చేస్తారా?

- Advertisement -