విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 269 పరుగుల చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 40 పరుగుల స్కోరు వద్ద టీమిండియా ఓపెనర్ రహానే(20) న్యూజిలాండ్ బౌలర్ నీషామ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ 70 పరుగుల (65 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. బౌల్ట్ విసిరిన బంతికి భారీ షాట్ కి ప్రయత్నించిన రోహిత్.. నీషామ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి మహేంద్ర సింగ్ ధోనీ 59 బంతుల్లో 41 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ఎంకే పాండే మైదానంలో కాసేపు కూడా నిలవకుండా వెంటనే డకౌట్‌గా వెనుదిగాడు. సోధీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 76 బంతుల్లో 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సోధీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన అక్సర్ పటేల్(24), జాదవ్(37)లు చివర్లో హిట్టింగ్ చేయడంతో ఇండియా 269 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోధీలకు రెండు వికెట్లు దక్కగా… నీషామ్, సాథనర్‌లకి చెరో వికెట్ దక్కింది.