భారత్ ఆసీస్ మధ్య జరిగిన ఐదో వన్డేలో 35పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 5వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ ను కైవసం చేసకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ నిర్ణిత 50ఓవర్లలో 273పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా 237పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచి తన సత్తాను చాటుకుంది. మొదటి రెండు మ్యాచ్ లలో ఓడిపోయినప్పటికి ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. టీంఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ(56) పరుగుల వద్ద అవుట్ కాగా ధావన్ 11పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత గ్రీస్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా 20పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కీపర్ రిషబ్ పంత్ , ఆల్ రౌండర్ విజయ్ శంకర్ లు 16పరుగులకే వెనుదిరిగారు. కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ లు తమ వంతు కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. కేదార్ జాదవ్ (44) , భువనేశ్వర్(46) పరుగుల వద్ద అవుట్ కావడంతో ఇద్దరు ఆఫ్ సెంచరీని మిస్ చేసుకున్నారు. ఇక ఆసీస్ బౌలింగ్ దాటికి ఇండియా బ్యాట్స్ మెన్లు తట్టుకోలేక పోయారు. ఆసీస్ బౌలర్ కు జంపా మూడు , రిచార్డ్ సన్ రెండు వికెట్లు తీయగా మిగతా వారు ఒక్కొ వికెట్ ను తీశారు. మరికొద్ది రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం నేపథ్యంలో ఇండియా ఆట తీరుపై సర్వత్రా విమర్శలు చేస్తున్నారు.