ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన మరోసారి చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొన్న టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. తాజాగా తొలిసారి ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. బెస్ట్ వన్డే ఫినిషర్ ఎమ్మెస్ ధోనీ మరోసారి మెరిసిన వేళ.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో కోహ్లి సేన విజయం సాధించింది.
231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధోనీ 87 పరుగులతో ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. అతనికి కేదార్ జాదవ్ చక్కని సహకారం అందించాడు. జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 46, ధావన్ 23 పరుగులు చేశారు. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 6×4), విరాట్ కోహ్లీ (46; 62 బంతుల్లో 3×4)