సెన్సార్‌కు సిద్ధమైన “దోషం”..

208
Dhosham

రా మూవీ రిక్రియేషన్స్ పతాకంపై కిషోర్, సన హీరో హీరోయిన్లుగా రఘు గోపసాని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోషం” నాకా…!దేవుడికా..? అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు రెడీ అవుతుంది.

Dhosham

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత రఘు గోపసాని మాట్లాడుతూ.. “వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు.. మనిషిని పట్టి పీడిస్తున్న దోషాల తలలను కోయడానికి త్రిశులంగా దూసుకొస్తున్న “దోషం” నాకా…!దేవుడికా..? అనే క్యాప్షన్‌తో రాబోతుంది.ఈ చిత్రం లోని నటీనటులు నెల్లూరు లోని రామాపురం వాస్తవ్యులు. వీరందరు చాల చక్కగా నటించారు .వీరందరికి నా ప్రత్యేక కృతఙతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రవీణ్ పున్నూరు అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తియ్యాయి. ఫిబ్రవరి ఎండింగ్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం” అన్నారు.

కిషోర్,సన,పున్నూరు ప్రవీణ్,పున్నూరు రాజేష్,వసీమ్,అనిల్ డబ్బు,వెన్నిల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:గౌతమ్ రవిరామ్,కెమెరా:శంకర్ కేసరి,ఎడిటింగ్:K R స్వామి,కాస్ట్యూమ్ డిజైనర్:మౌనిక డబ్బుగుంట, డిజైనర్:M K S మనోజ్, కో ప్రోడుసుర్స్:ఒంటేరు మాల్యాద్రి,మోహన్ రామచంద్రయ్య,సురేష్ పెంట్యాల,కోటపాటి రుషీల్ ,డబ్బుగుంట వెంకయ్య,కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం:రఘు గొపసాని.