తొలి టీ20 మ్యాచ్: భారత్‌ బ్యాటింగ్..

68
India vs Australia

ఆస్ట్రేలియా,భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగునుంది.. కాన్ బెర్రాలోని మనూకా ఓవల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన టీ20 సిరీస్ చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చహర్, నటరాజన్ లకు స్థానం కల్పించారు.

కాగా నటరాజన్ కిది తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో ఆకట్టుకునేలా బౌలింగ్ చేసిన ఈ తమిళనాడు యార్కర్ స్పెషలిస్ట్ జట్టు మేనేజ్ మెంట్ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఇక, ఆతిథ్య ఆసీస్ జట్టులో డార్సీ షార్ట్, మాథ్యూ వేడ్ లు తుది జట్టులోకి వచ్చారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మనూకా ఓవల్‌ మైదానం వేదికగా మ్యా,చ్ జరుగుతుంది.

టీమిండియా: శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ (wc), విరాట్ కోహ్లీ (c), శ్రేయాస్ అయ్యర్, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, టి నటరాజన్

ఆస్ట్రేలియా : ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), మాథ్యూవేడ్‌, స్టీవ్‌స్మిత్‌, హెన్రిక్స్‌, అలెక్స్‌ క్యారీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆష్టన్‌ అగర్‌, సీన్‌ అబోట్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడం జంపా