ఆసీస్‌తో టీ20కి కోహ్లీ సేన రెడీ..

202
india vs australia
- Advertisement -

ఆసీస్‌తో టీ20 మ్యాచ్‌కి భారత్ సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు బ్రిస్బేన్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మూడు టీ20 సిరీస్‌లు జరగనుండగా కోహ్లీ రాకతో భారత్ మరింత బలపడింది. ఆసీస్‌ను చిత్తు చేయాలని భావిస్తున్న కోహ్లీ సేన ఈ సారి పర్యటనలో చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.

రెండేళ్ల క్రితం ధోనీ నేతృత్వంలో ఆసీస్‌లో పర్యటించిన టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌ కోసం 12 మంది ఆటగాళ్లను ప్రకటించ గా కోహ్లీ రాకతో మనీష్‌ పాండే రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా ,పేసర్లు భువనేశ్వర్‌, బుమ్రా, స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లతో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.

మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత 4 టెస్టులు, 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్-ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 1 5 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 10 సార్లు విజయం సాధించగా, ఆస్ట్రేలియా 5 సార్లు విజయం సాధించింది. సొంతగడ్డపై ఆసీస్‌ 2014, నవంబర్‌లో చివరిసారిగా టీ20 సిరీస్‌ గెలిచింది.

- Advertisement -